Raghul Prith’s upcoming movies in Telugu

rakhul preet singh

అనుష్క-నాగార్జన కలిసి చేయడం అంటేనే అభిమానుల మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే వీరిద్దరి జంట వెండితెరపై మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వుంటుంది. కానీ ఈసారి అనుష్కను రకుల్ ప్రీత్ సింగ్ పోటి చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం వినిపిస్తుంది. నాగ్- అనుష్క కాంబోలో ఇప్పటికే ఐదారు సినిమాలొచ్చాయి. ఛేంజ్ కోసం.. అనుష్క బదులూ లో రకుల్‌ను తీసుకున్నట్లు వినికిడి .
నాని, నాగార్జున హీరోలుగా ఆదిత్య శ్రీరామ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్న సినిమాలో ర‌కుల్‌ను ఓక హిరోహింగా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ స‌హా కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నాని సరసన నటిస్తుందని సమాచారం. ఇక రకుల్ హిందీ చిత్రం ”అయ్యారి”జనవరి 26 రిప‌బ్లిక్ డే కానుక‌గా విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో విస్త్ర‌తంగా ప్ర‌చారంతో బిజీగా ఉంది ర‌కుల్‌ సింగ్. సూర్య 36వ సినిమాలో కూడా ర‌కుల్ ప్రీత్ నాయిక‌గా నటించింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రుపుదిద్దికుంటుంది. మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమాకి ర‌కుల్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ నానికి హీరోయిన్ అయితే.. అనుష్కనే నాగార్జునకు జోడీగా తీసుకునే అవకాశం లేకపోలేదని సినీ జనాల్లో టాక్.

 

Related

JOIN THE DISCUSSION

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: